కంసుడు చచ్చిన వార్త తెలియగానే అతని భార్య లందరూ మూర్తీభవించిన శోక దేవతలలాగా వచ్చి, తమ భర్త కళేబరం మీద పడి వైనవైనాలుగా ఏడ్చారు. మూడు లోకాలలోనూ కంసుణ్ణి జయించ గలవాడు లేడని వాళ్ళ నమ్మకం. అలాటివాడు ఒక కుర్రవాడి చేతిలో అంత దారుణంగా మర ణిస్తాడనీ, ఇంతలోనే తమకు వైధవ్యం సంప్రాప్త మవుతుందనీ వారు అనుకోలేదు.
కంసుడి తల్లి కూడా తన కోడళ్ళతో బాటు కొడుకు కోసం దుఃఖించింది. ఆమె తన భర్త అయిన ఉగ్రసేనుడి వద్దకు వెళ్లి, "పిడుగు పడి కూలిపోయిన కొండలాగా పడి ఉన్న నీ కొడుకును చూసుకున్నావా? వాడికి దహనసంస్కారాలు జరపాలి గదా? తన బాహుబలంతో కృష్ణుడు రాజ్యాన్ని గెల్చుకున్నాడు. కృష్ణుణ్ణి ఉత్తరక్రియలకు అనుమతించమని అడుగు,” అన్నది.
కంసుడి చావు చూసి మరీ వెళ్ళిపోదా మన్నట్టుగా సూర్యుడు అస్తమించాడు. ఆ సంధ్యవేళ యాదవుల మధ్య ఉన్న కృష్ణు డికి కంసుడి భార్యల రోదనలు విన వచ్చాయి. అతని కళ్ల నీళ్ళు తిరిగాయి. అతను తన చుట్టూ ఉన్న బంధుజనంతో, "నేను అతి బాల్యం మూలాన ఉద్రేకంతో ఎంత మంది స్త్రీలకు వైధవ్యదుఃఖం కలి గించాను! కాని, నిజం ఆలోచిస్తే, కంసుడి దుర్మార్గానికి మరొక విరుగుడు లేదు. ఈ దుర్మార్గుడిలాగా తన తండ్రిని నిర్బంధంలో ఉంచి తానే రాజ్యం ఏలినవా డెక్కడైనా ఉన్నాడా ? పాపిని చూసి జాలిపడటం కూడా పాపమే నని చెబుతారు. లోకక్షేమం కోరి నేనీ దుర్మార్గుణ్ణి చంపాను. ముందు ఏం చెయ్యాలో కూడా నేను ఆలోచించే పెట్టాను,” అన్నాడు.
అతనిలా అంటూండగానే ఉగ్రసేనుడు, శిని మొదలైన యాదవవృద్దులను వెంట బెట్టుకుని వచ్చి, కృష్ణుడి ముందు కొద్దిసేపు కీర్తి చాలు. తల వంచుకుని నిలబడి, కన్నీరు కార్చి, అతి భయంకరుడైన శత్రువును హతమార్చి గొప్ప ఖ్యాతి సంపాదించుకున్నావు, యాదవ వంశానికి మహదానందం చేకూర్చావు: ఇక రాజ్యం నీదే. నువే రాజువు. ఏ లోటూ లేకుండా మహా వైభవంగా రాజరికం అను భవించు. నీ శత్రువు పోయాడు గనక, నీ మనసులో పగ పెట్టుకోక, నా బోటివారి పట్ల ఆదరంతో ప్రవర్తించు. ప్రస్తుతం కంసుడి ప్రేతవిధి జరగవలసి ఉన్నది. ఇందుకు నువు అనుమతించే పక్షంలో నేనూ, నా భార్యా, నా కోడళ్ళూ ఇన్ని నీళ్ళు వదలు తాము. ఆ తరవాత నేను జటావల్క లాలు ధరించి అరణ్యవాసం చేసుకుం టాను,” అన్నాడు.
ఆ మాటకు కృష్ణుడు, “దీనికి నా అను మతి కావాలా ? కంసుడి ఉత్తరక్రియలకు నేను అభ్యంతరం చెబుతానా ? ఒక్క మాట చెప్పవలసి ఉన్నది. నాకు రాజ్యంతో పని లేదు. నేను రాజధనం మీద ఆశ కొద్దీ కంసుణ్ణి చంపలేదు. వంశద్రోహీ, లోక కంటకుడూ కనక లోకహితం కోరి అతన్ని చంపాను. అందువల్ల నాకు వచ్చే ఇక నేను నా మానాన ఆవులమందల మధ్యకు.. వెళ్ళి, అడవి తల ఎత్తి, గద్గద కంఠంతో, "నాయనా, జంతువులాగా గోపాలకులతో కలిసి ఆటలూ, పాటలూ సాగిస్తాను. నా మనవి ఒకటి ఉన్నది. నే నీ మాటలు కపటంగా అంటున్నవి కావు. న్యాయంగా నీదైన రాజ్యాన్ని నీచుడై నీ కొడుకు హరించాడు. అది చివరకు నీదే అయింది. ఈ హాయిగా రాజ్యాభిషేకం చేసుకో. ఈ రాజ్యం నేను గెలిచి నీ కిస్తున్నాను. నా మీద వాత్సల్య ప్రేమలున్న పక్షంలో నా కోరిక నిరాకరించ వద్దు,” అన్నాడు.
అనటంతో పోనివ్వక కృష్ణుడు ఉగ్ర సేనుడికి అప్పటికప్పుడే అందరి మధ్యా రాజ్యాభిషేకం జరిపించేశాడు. ఉగ్రసేనుడు బలరామ కృష్ణులకు చేయించవలసిన సంస్కరణలన్నీ చేయించాడు. కృష్ణుడు పూనుకుని మధురానగరాన్ని పూర్వంకన్న చాలా వైభవంగా తయారుచేశాడు.
ఒకనాడు అతను బలరాముడితో, "మనం పుట్టిన నాటినుంచీ చదువూ, సంస్కారమూ, ఆచారమూ లేకుండా అడవుల వెంటబడి తిరిగాం. ఇప్పటికైనా ఒక గురువు దగ్గిర చేరి చదువుకోవటం మంచిది గదా !" అన్నాడు.
ఈ ఆలోచన రాగానే బలరామకృష్ణులు తమ అభిప్రాయాన్ని అయినవాళ్ళకు చెప్పి, · వారి అనుమతితో ఆవంతిపురంలో ఉండే సాందీపను డనే బ్రాహ్మణుడి వద్దకు వెళ్లి, తమ గోత్రనామాలు తెలుపుకుని, చదువు చెప్పమని ప్రార్థించారు. ఆయన వాళ్ళను తన శిష్యులుగా పరిగ్రహించి, అరవైనాలుగు రోజులలో నాలుగు వేదాలూ, షడంగాలూ చెప్పాడు. వాళ్ళు పన్నెండు రోజులలో ధర్మశాస్త్రమూ, తర్కము, న్యాయ శాస్త్రమూ, గణితమూ, సంగీతమూ, సైనిక విద్యలూ నేర్చుకున్నారు, యాభై రోజులలో అస్త్రశాస్త్రం పూర్తిగా అభ్యసించారు. సాందీపనుడు వారి అధ్యయన శక్తి చూసి, "వీళ్లు మానవ రూపంలో వచ్చిన సూర్య చంద్రులా ఏమిటి?” అనుకుని ఆశ్చర్యం పొందాడు.
బలరామకృష్ణులు గురువు వద్ద విద్యా భ్యాసం పూర్తిచేసి, ఆయనకు నమస్కరించి, "మీ దయవల్ల మేము విద్యావంతుల మయాం. మా వల్ల మీకు ఏం కావాలో కోరండి. ఎంత దుర్ఘటమైనా సరే, మీ కోరిక నెర వేరుస్తాం,” అన్నారు.
ఆ మాట విని సాందీపనుడు, "నా కొక కొడుకుండేవాడు. వాడు తీర్థయాత్రలు చేస్తూ సముద్రస్నానం చేస్తూండగా ఒక తిమి వాణ్ణి మింగింది. ఆ పుత్రశోకం నన్నిప్పటికీ దహించుతూనే ఉన్నది. నా కొడుకును ఎలాగైనా నాకు తిరిగి ఇప్పించండి, అంతేచాలు,” అన్నాడు.
ఆయన కోరిన గురుదక్షిణ చెల్లించటానికి నిశ్చయించి కృష్ణుడు, అన్న అనుమతి పొంది, ధనుర్బాణాలు తీసుకుని సముద్ర తీరానికి వెళ్ళి, సముద్రుడితో, " మా గురువు గారు సాందీపనుడు తన కొడుకును నీలో పోగొట్టుకున్నాడట. అతన్ని మింగిన దుష్టుణ్ణి తక్షణం చూపించు," అన్నాడు.
వెంటనే సముద్రుడు ప్రత్యక్షమై చేతులు జోడించి, "పంచజను డనే రాక్షసుడు తిమి రూపంలో వచ్చి మీ గురువుగారి కొడు కును మింగేశాడు. ఆ రాక్షసుణ్ణి ఇప్పుడే నీ ముందుంచుతాను,” అన్నాడు.
మరుక్షణమే సముద్రపు కెరటాలు తిమి రూపంలో ఉన్న పంచజనుణ్ణి తెచ్చి ఒడ్డున పారేశాయి. కృష్ణుడు కత్తితో దాని పొట్ట చీల్చి చూస్తే దానిలో గురుపుత్రుడు లేడు, కాని ఒక గొప్ప శంఖం ఉన్నది. దాన్ని చూడగానే కృష్ణుడికి ముచ్చట వేసి, తన ఉపయోగం కోసం ఉంచుకున్నాడు. పంచ జనుడి కడుపులో దొరికింది గనక ఆ శంఖా నికి పాంచజన్య మనే పేరు వచ్చింది.
అయితే గురుపుత్రుడి సమస్య తీరలేదు. ఆకుర్రవాడు ఏమై ఉంటాడు? చచ్చిపోయి యమలోకానికే పోయి ఉండాలి. ఇలా అనుకుని కృష్ణుడు తిన్నగా దక్షిణ దిక్కుగా బయలుదేరి యమలోకానికి వెళ్ళి, సింహా సనం మీద కూర్చుని ఉన్న యమధర్మరాజును చూసి, కోపంగా, "మా గురువు గారైన సాందీపనుడి కొడుకును నువు తీసు కొచ్చావు. అతన్ని నాకు తిరిగి ఇచ్చెయ్యి. నీ ఇవ్వకుండా దౌర్జన్యానికి దిగావో, ప్రాణాలు తీస్తాను," అన్నాడు.
యముడు వొణికిపోతూ లేచి నిలబడి, చేతులు జోడించి, " నేను ప్రాణుల పుణ్య పాపాలు నిర్ణయించే వాణ్ణిగాని, ప్రాణాలు తెచ్చేవాణ్ణి కాను. అది మృత్యువు పని," అని చెప్పాడు.
"మృత్యువు కింత పొగరా? మా గురు పుత్రుణ్ణి తీసుకు పోవటమే గాక, మమ్మల్ని ఇంత దూరం తిప్పిస్తాడా? వాడి ఆయువు మూడింది !" అంటూ కృష్ణుడు వింటికి ఒక దివ్య బాణం ఎక్కుపెట్టాడు. అది చూసి భయపడి మృత్యువు గురుపుత్రుడి ప్రాణా లను తిరిగి శరీరంలో ఉంచి తెచ్చి, కృష్ణుడి ముందుంచాడు.
ఈ విధంగా కృష్ణుడు సముద్రుణ్ణి, యముణ్ణి, మృత్యువునూ గడగడ లాడించి, పాంచజన్యాన్నీ, ప్రాణాలతో గురుపుత్రుణ్ణి సాధించి, తన గురువు దగ్గిరికి తిరిగివచ్చాడు. గురువుగారు ఆశ్చర్యంతోనూ, ఆనందం తోనూ వివశుడై, తన కొడుకుని కౌగలించు కుని, అపూర్వమైన గురుదక్షిణ ఇచ్చి నందుకు కృష్ణుణ్ణి వెయ్యివిధాల ఆశీర్వ దించాడు. బలరామకృష్ణులు మరికొన్ని రోజులు గురువుగా రింట ఉండి, ఆయన వద్ద సెలవు పుచ్చుకుని, మధురానగరానికి తిరిగి వచ్చారు.
వాళ్ళకు ఉగ్రసేనుడు బ్రహ్మాండమైన స్వాగతమూ ఊరేగింపూ ఏర్పాటుచేసి, బంధువులనూ, పరివారాన్నీ వెంటబెట్టుకుని వాళ్ళకు ఎదురు వెళ్ళి, మేళతాళాలతో తీసు కొచ్చాడు. బలరామకృష్ణులు వసుదేవుడి ఇంటికి చేరుకుని, తమ విద్యాభ్యాసం అను భవాలు అందరికీ చెప్పి, సుఖంగా కాలం గడపసాగారు.
జరాసంధుడు మగధదేశానికి రాజు. ఇతని కుమా ర్తెలు అస్తి, ప్రాస్తి అనేవాళ్ళు కంసుడి భార్యలు. తన అల్లుణ్ణి కృష్ణుడు చంపి, తన కుమార్తెలకు వైధవ్యం కలి గించాడన్న వార్త విని ఆ కోపంతో, జరా సంధుడు, అనేకమంది రాజులను కూడ గట్టుకుని, ఇరవైఒక్క అక్షౌహిణీల సేనను వెంటబెట్టుకుని మధుర మీదికి యుద్ధానికి బయలుదేరి వచ్చి, యమునా తీరాన విడిసి, విందుడూ, అనువిందుడూ అనే రాజకుమా రులను కృష్ణుడి వద్దకు తన దూతలుగా పంపాడు. వారు ఉగ్రసేనుడి సభకు వచ్చి, ఆ సభలోనే బలరాముడితో సహా కూర్చుని ఉన్న కృష్ణుడితో, జరాసంధుడి మాటలుగా ఇలా చెప్పారు :
"నువూ, నీ అన్నా పెద్ద మొనగాళ్ళ లాగా వచ్చి కంసుణ్ణి, అతని తమ్ముణ్ణి చంపారు. కంసుడు నా అల్లుడు. నా కుమార్తెల వైధవ్యదుఃఖం చూడలేక, నీతో యుద్ధం చెయ్యటానికి వచ్చాను. నువు త్వరగా యుద్ధానికి రా. నువ్వయినా బతికి ఉండాలి, నేనైనా బతికి ఉండాలి; మన ఇద్దరికి భూమి మీద చోటు లేదు. ఎదట నిలబడి నాతో యుద్ధం చేశావా నిన్ను చంపేస్తాను; యుద్ధం చెయ్యలేక పారిపోయావా, పాతాళంలో దూరినా వెంట తరిమి హతమార్చుతాను. నే నెలాటివాణ్ణి అక్రూరుణ్ణి అడిగినా, నీ తమ్ముడు సాత్యకిని అడిగినా చెబుతారు. రేపే మధురానగ రానికి ముట్టడి వేస్తున్నాను. కనక నువు సిద్ధంగా ఉండు.”
జరాసంధుడి మాటలుగా దూతలు
చెప్పిన ఈ మాటలు విని కృష్ణుడు నవ్వుతూ, " చాలా సంతోషం. నేను ఇన్ని మాటలవాణ్ణి కాను. జరాసంధుడి కొవ్వు అణచటానికి నేనే వద్దామనుకుంటుండగా తానే వచ్చాడు. రానీ. పూర్వం రాక్షసి అతికించిన అతని శరీరాన్ని మళ్లీ రెండుగా చీలుస్తాను. కంసుణ్ణి చంపి ఈ రాజ్యాన్ని ఉగ్రసేనుడి కిచ్చినట్టే, జరాసంధుణ్ణి చంపి, అతని కొడుక్కు మగధ రాజ్యాభిషేకం చేస్తాను," అన్నాడు.
జరాసంధుడి దూతలుగా వచ్చిన రాజ కుమారులు కృష్ణుడి చేత సత్కారాలు పొంది వెళ్ళి, అతను చెప్పిన జవాబు జరాసంధు డికి అందించారు.
జరాసంధుడి పేరు వినగానే ఉగ్ర సేనుడు మొదలుగా గల యాదవు లందరికీ కాళ్ళు చల్లబడ్డాయి. వారిలో వికద్రు డనే యదువృద్ధుడు, కృష్ణుడితో ఇలా అన్నాడు.
"నాయనా, కమలంలో బ్రహ్మ పుట్టి నట్టుగా ఈ యదువంశంలో నువు పుట్టావు. నువ్వుండగా యాదవుల కే భయమూ ఉండదు. జరాసంధుడికి అంతులేని రాజుల అండ ఉన్నది. అతను యుక్తిపరుడు, దారుణ స్వభావుడు. అతన్ని యుద్ధంలో ఓడించే శక్తి నీ కొక్కడికే ఉన్నది.
కంసుడు బలగర్వితుడై కోటకు ఎలాటి రక్ష ణలూ లేకుండా ఉంచాడు. ఆయుధాలు సిద్ధంగా లేవు, ఆహారపదార్థాలు అంతకన్నా లేవు. నిజానికిది ఇవాళ దుర్గమే కాదు. అకస్మాత్తుగా శత్రువు వచ్చి పడ్డాడు. అతన్ని ఎదిరించక ఎవరి మానాన వారు చేతులు కట్టుకు కూర్చుంటే ఈ రాష్ట్రం దక్కదు. పూర్వం ముచికుందుడూ, పద్మవంతుడూ, సారసుడూ, హరితుడూ అనే యాదవ రాజులు ఋక్షవంతమూ, వింధ్యమూ, సహ్యమూ అనే పర్వతాలలోనూ, పడమటి సముద్రంలోని దీవులలోనూ శత్రువులకు లొంగని దుర్గాలెన్నో నిర్మించారు. వీరు నలుగురికి పూర్వమే మాధవుడు ఈ మధు రను పాలించాడు. ఈ నాడు దీనిని బల పరచటం సాధ్యం కాదు. వేరే మరొక దుర్గం ఏర్పాటు చేసుకోవలిసిందే. సూచన ప్రాయంగా చెప్పాను. కర్తవ్యం నువే ఆలోచించు.”