గోకుల మంతా ఒక్కసారి కదిలింది. అందరూ ప్రయాణసన్నాహంలో ముణిగి పోయారు. బరువులు బళ్ళకెత్తారు. నేతులూ, పాలూ గల కుండలను భద్ర పరిచారు. సంచులలో ధాన్యమూ, బియ్యమూ మొదలైనవి పోసి కట్టారు. రక రకాల తాళ్ళూ, పలుపులూ, కవ్వాలూ, కొడవళ్ళూ, కత్తులూ, గంటలూ, పశువులు నోళ్ళు తెరవటానికి ఉపయోగించే సాధ నాలూ మొదలైన పనిముట్లన్నీ జాగ్రత్త పరిచారు. కోలాహలంగా ప్రయాణ సన్నాహం పూర్తి అయింది.
బలశాలులు పశువులను తోలుకుంటూ ముందు బయలుదేరారు. మందల వెనకగా బళ్ళు నడిచాయి. వాటి వెనక మనుషులు కదిలారు. వయసులో ఉన్న ఆడ వాళ్ళంతా ఒక జట్టుగా నడుస్తూ, పరాచకా లాడుకుంటూ, వినోదం పొందారు. కుంటి, గుడ్డి, ముసలివాళ్ళు నడవలేకుండా ఉంటే వాళ్ళకు యువకులు సహాయపడ్డారు.
ఈ విధంగా గోకులం బృందావనానికి వచ్చి చేరింది. గోపాలకులలో పెద్దలైన వాళ్ళు ఇళ్ళు కట్టుకోవటానికి స్థలాలు నిర్ధారణ చేశారు. బళ్ళన్నీ ఒక వరసలో అర్థచంద్రాకారంలో దిగాయి. కొందరు గుడిసెలు నిర్మించారు. కొందరు లతా గృహాలనే తాత్కాలికంగా ఇళ్ళుగా వాడు కున్నారు. కొందరు చెట్ల కింద కాపరాలు పెట్టేశారు. కొందరు కంప పేర్చి దొడ్లు నిర్మించారు. ఒక్క రోజు గడిచే సరికల్లా బృందావనం గోపకులకు స్వస్థలమయి పోయింది. రోజులు గడిచేకొద్దీ, చక్కగా అలంకరించుకు తిరిగే గోపికలతోనూ, ఆడా వుడిగా తిరిగే గోపాలకులతోనూ, సందడి చేసే గోవులమందలతోనూ ఆ ప్రదేశానికి ఎక్కడలేని కళా వచ్చింది.
నానాటికీ గోపకులంవాళ్ళ సంపద పెంపొందుతున్నది. మందలు పెద్దవవు తున్నాయి. జీవితం హాయిగా నడుస్తున్నది. కృష్ణుడు పదమూడేళ్ళ వాడయాడు.
వేసవి వచ్చింది. నిక్షేపంగా ఉన్న పశు వులకు రకరకాల తెగుళ్ళు పుట్టుకొచ్చాయి. అవి వణుకుతూ, నిలబడలేకపోయాయి. నోట నురుగులు కక్కాయి. వాటి మెడలు వాలబడిపోయాయి. గిట్టలు పగిలి పురు గులు బయటికొచ్చాయి.
ఈ తెగుళ్ళకు గోపాలకులు మంత్రాలూ, మందులూ, మాకులూ, అన్నీ ప్రయోగించి చూశారు. కాని ప్రయోజనం లేకపోయింది. ఇక ఏం చెయ్యాలో వారికి తోచలేదు. ఈ తెగుళ్ళు యమునానదీ ప్రాంతపు అర ణ్యాలలోని సమస్త మృగ పక్షి కీటకజాతు లకూ వచ్చాయి, వాటి నుంచి గోపకులకు కూడా రోగాలు తగిలాయి. అందరూ భయంకరమైన వ్యాధిలక్షణాలతో బాధ పడసాగారు.
నందుడూ, యశోదా, రోహిణీ కూడా రోగగ్రస్తులయారు. ఆ రోగగ్రస్తులయారు. ఆ స్థలం వదిలిపెట్టి పోతేగాని బతకలేమని కృష్ణుడికి తోచింది. అతను బలరాముడితో మాట్లాడి, కొన్ని మందలను తోలుకుని ఒక కోసుదూరం వెళ్ళి అక్కడ ఆగాడు. అతనిలాగే మరి కొందరు గోపకులు కూడా అలాగే చేశారు. అలా వెళ్ళిపోయిన గోవులకూ, మనుషులకూ వ్యాధి సోకలేదు.
నందుడు మాత్రం కదలన నేశాడు. "ఇది మన చోటు. ఇక్కడ ఏమి వచ్చినా భరించవలిసిందేగాని, చుట్టాలందరినీ వేసుకుని ఎక్కడికని వెళ్ళేది?” అన్నాడతను. నంద యశోదా రోహిణులు రోగంతో తీసుకుంటూ ఇలా మూర్ఖం చేసరికి ఏం చెయ్యాలో కృష్ణుడికి తెలియలేదు.
ఈ గోకులంలో విదేహదేశం నుంచి వచ్చిన ఒక ముసలి గోపకుడొక డున్నాడు. అతను గోప ప్రముఖులతో, "చూడండి, నాయనలారా! మనం పశువుల నాశ్ర యించి బతుకుతున్నవాళ్ళం. పశుపతి శివుడు. శివార్చన చేస్తేనేగాని మనకీ కష్టాలు తీరవు. ఇలా దిగాలుపడి చూస్తూ కూర్చుంటే ఎమీ లాభంలేదు. తెలిసిన బ్రాహ్మణులను పిలిపించి శివార్చన జరిపించండి,” అన్నాడు.
పెద్దవాడు చెప్పిన మాటపైన గురి ఉంచి గోపకులు సమర్థులైన బ్రాహ్మణులను పిలిపించి శివ పూజకు అవసరమైన ఏర్పాట్లన్నీ చేశారు. ఈశ్వరుడికి వారం రోజులపాటు పగలూ, రాత్రీ అభిషేకము, అర్చనా, నైవేద్యమూ జరిగాయి. ఏడు రోజులూ నిర్విఘ్నంగా శివార్చన జరగగా ఏడోనాటి మధ్యాన్నం ఒక సబ్రాహ్మణుడికి పూనకం వచ్చింది. ఆ పూనకంలో ఆ బ్రాహ్మణుడు వెర్రిగా నవ్వుతూ భయంకరంగా నాట్యం చేస్తూ ఇలా అన్నాడు.
"నన్ను పరమశివుడు కైలాసం నుంచి పంపాడు. 'ఒరే, శంఖకర్ణా, కాళిందీతీరాన రోగాలతో తీసుకుంటున్న ప్రాణులకు మేలు చెయ్యి, వెళ్ళు!' అని నాతో అన్నాడు. మీరు చేసిన అర్చనకు శివుడు సంతోషిం చాడు. మీ కందరికీ ఈ రోగాలు రావ టానికి కారణం తెలుసా? ద్వాపరయుగాం తంలో రాక్షసులందరూ భూలోకాన్ని పీడిం చటానికి రకరకాల జన్మలెత్తేటప్పుడు, కాల కలి అనే రాక్షసుడు, విరోచనుడి కొడుకు, ఒక విషపు వెలగచెట్టుగా యమునానదికి దక్షిణతీరాన మొలిచాడు. ఆ చెట్టు చుట్టూ ఆ రాక్షసుడి బంట్లందరూ విషవృక్షాలుగానూ, ముళ్ళ చెట్లుగానూ పుట్టారు. ఆ విషపు వెలగ చెట్టు గాలిసోకి మీకూ, మీ పశువు లకూ ఈ రోగాలు వచ్చాయి. దాని మూలంగా నీరు కూడా చెడిపోయింది. ఆ విషవృక్షాన్ని నిర్మూలించే శక్తి నంద గోపుడి కొడుక్కూ, బలరాముడికీ ఉన్నది. వాళ్ళందుకు ఒప్పుకునే పక్షంలో మీరంతా బతికిపోతారు. ఈ మాట మీకు చెప్పమని పరమశివుడు నన్ను పంపాడు. ఇక నేను పోతాను, శలవిప్పించండి.”
ఈ మాటలంటూండగానే బ్రాహ్మణుడికి పూనకం దిగిపోయింది. బ్రాహ్మణులు సంతోషించి, శివార్చన పరిసమాప్తి చేసేశారు. వెంటనే గోపకులు బలరామకృష్ణులను పిలిపించి, వారికి సంగతంతా చెప్పారు. అంతా విని వాళ్ళు, "ఈశ్వ రాజ్ఞ అయింది. తల్లిదండ్రులనూ, కులం వాళ్ళనూ బతికించుకునే అవకాశం కన్న కావలిసినదేమున్నది? ఆ విషపు వెలగ చెట్టును తప్పక నిర్మూలిస్తాం,” అన్నారు.
కృష్ణుడు బ్రాహ్మణులకు నమస్కారం చేసి, శంకరుడి ముందు సాష్టాంగపడి, శివాలయం చుట్టూ ప్రదక్షిణ చేసి బలరాముడి కేసి చూశాడు. బలరాముడు కూడా అలాగే చేశాడు. తరువాత వాళ్ళిద్దరూ కత్తులూ, గొడ్డళ్ళూ తీసుకుని విషవృక్షం ఉండే ప్రాంతానికి బయలుదేరారు.
శివార్చనతోనే చాలామంది గోపకులకు ఆరోగ్యం కలిగింది. వాళ్ళందరూ కూడా సింహనాదాలు చేస్తూ, బలరామకృష్ణుల వెంట బయలుదేరాడు.
విషవృక్షం ఎక్కడ ఉన్నదా అని వెతికే అవసరం కూడా లేకపోయింది. వాళ్ళు కి కారణ్యం కేసి నడిచే కొద్దీ చెట్టు నుంచి వచ్చే దుర్గంధం దుర్భరం అయింది. త్వరలోనే ఆ విషవృక్షం వారికి భయం కరాకారంలో ఎదురుగా కానవచ్చింది. అది ఆకాశమంత ఎత్తుండి ఒక పెద్ద భూతం లాగున్నది. దాని చుట్టూ చాలా దూరందాకా దారుణమైన ముళ్ళచెట్లు వ్యాపించి ఉన్నాయి. బలరామకృష్ణులు కత్తులతో ఆ ముళ్ళపొదలను నరికి దారి చేసుకుంటూ విషవృక్షాన్ని సమీపించారు.
ఆ విషపు వెలగబెట్టు మొదలు ముఫ్ఫై బారలున్నది. దాని కాయలు ఏనుగు తల లంతేసి ఉన్నాయి. దాని కొమ్మలు అన్ని వైపులకూ అంతులేకుండా వ్యాపించి ఉన్నాయి. దుర్గంధ మంతా ఆ చెట్టు కాయల నుంచే వస్తున్నది. అందు చేత ముందుగా వాటిని నిర్మూలించాలను కున్నాడు కృష్ణుడు.
బలరామకృష్ణు లిద్దరూ కలిసి చేతికందిన పిందెలనూ, కాయలనూ, దోరకాయలనూ, పళ్లనూ తెంచిపారెయ్య నారంభించారు. అందని వాటిని రాళ్ళతోనూ, కర్రలతోనూ కొట్టి రాల్చారు. అందీ అందని కొమ్మలను పట్టి వంచి ఫెళ ఫెళా విరిచేశారు. గోపాలకు లందరూ పెద్ద పెట్టున కేకలు పెడుతూ ఈ పనిలో సహాయపడ్డారు. కొంతసేపటికి చెట్టు మీద ఒక్క పిందె కూడా మిగలలేదు.
బలరామకృష్ణులు ఈ విధంగా విష వృక్షాన్ని ధ్వంసం చేస్తూ ఉంటే ఆ ప్రాంతంలో తిరిగే కొన్ని ఆవులూ, దూడలు గోపకుల పైకి దౌర్జన్యంగా వచ్చాయి. అవి మామూలు ఆవులూ, దూడలూ కావు. అక్కడ చెట్లుగానూ, పొదలుగానూ జన్మించిన రాక్షసులు భార్యలూ, వాళ్ళ పిల్లలూ పశువుల రూపంలో అక్కడ సంచరిస్తున్నారు.
నెత్తురు కృష్ణుడు ఈ పశువులను నిర్మూలించ సాగాడు. రాక్షసులు తమ అసలు రూపాలతో, కక్కుతూ, చచ్చిపోనారంభిం చారు. గోమాతలుగా ఉన్న రాక్షసస్త్రీలు మండిపడి, కృష్ణుణ్ణి తమ కొమ్ములతో పొడిచి చంపబోయారు. కృష్ణుడు అవలీలగా వాటిని పారదోలాడు. ఆ తరవాత అతను విషవృక్షాన్ని పూర్తిగా ధ్వంసం చేసేశాడు.
గోపకుమారు లందరూ కలిసి ఆ చెట్టు తుండాలనూ, చుట్టూ ఉండిన ముళ్ళ చుట్టూ ఉండిన ముళ్ళ పొదలనూ, చచ్చిన రాక్షసకళేబరాలనూ ఒక గుట్టగా వేసి, ఆ గుట్టకు నిప్పు అంటిం గుట్టకు నిప్పు అంటిం చారు. చూస్తుండగానే మంటలు ఆకాశ మెత్తు లేచాయి. అగ్ని హెూత్రుడా చెట్లనూ, పొదలనూ, రాక్షసకళేబరాలనూ అతి ప్రీతిగా దహనంచేసి ఇంత బూడిద మిగిల్చాడు.
గోపాలకులందరి శరీరాలూ చెమటతో తడిసి, నుసి అంటుకున్నాయి. వాళ్ళు చాలా శ్రమపడి అలిసిపోయి ఉన్నారు. అందుచేత అందరూ ఇసుక మీదుగా యమునా నదికి వెళ్ళారు. అక్కడ వాళ్ళు చాలాసేపు ఈతలు కొట్టారు, ఓలలాడారు, నీటిమీదచేతులతో దరువులువేస్తూ పాటలు పాడారు. ఆ విధంగా పొద్దువాలే దాకా జల క్రీడలాడి సాయంకాలం వేళకు నీటి నుంచి బయటికి వచ్చి, తల్లులు తెచ్చిన భోజనాలు తిని, తాంబూలాలు వేసుకుని, కాస్సేపు విశ్రాంతి తీసుకుని మళ్ళీ ఇళ్ళకు ఆడుతూ, పాడుతూ తిరిగి వచ్చారు.
రోజులు గడుస్తున్నాయి. మనుషులకూ, పశువులకూ వచ్చిన తెగుళ్ళు నివారణ అయాయి. ఇంతలో వేసవి కూడా గడిచి పోయింది. వర్షాకాలం ఆరంభం కాబో తున్నట్టు గుర్తుగా ఆకాశాన నల్లని మేఘాలు కమ్మసాగాయి. మేఘగర్జన వినిపించి అందరికీ ఉత్సాహం పుట్టుకొచ్చింది. త్వర లోనే వడగళ్ళతో సహా వాన ఆరంభ మయింది. ధారాపాతంగా వర్షం పడింది. భూమి పచ్చగా అయింది. సెలయేళ్ళూ, నదులూ నిండుగా పారాయి.
ఇలాంటి ఆనంద సమయంలో, విదేహ దేశంలో ప్రజలందరినీ భయోత్పాతంలో ముంచెత్తే కొన్ని విపరీత సంఘటనలు జరగసాగినై. ఆ ప్రాంతాల నివసించేవారిలో కుంభకు డనేవాడు గొప్ప గోధనాలు కల వాడు. అతడు దాతృత్వానికి, ధర్మగుణా నికీ పేరు పొందినవాడు. అర్ధులకు లేదన కుండా, అతడూ, అతడి భార్య అయిన ధర్మద దానాలు చేస్తూండేవారు. అతడు యశోదకు తమ్ముడు. శ్రీధాముడనే పుత్రుడూ, నీళ అనే కన్యా అతని సంతానం.
పూర్వం తారకాసురుడితో విష్ణువు యుద్ధం చేసినప్పుడు, ఆ యుద్ధంలో కాల 'నేమి పుత్రులేడుగురిని అతడు వధించాడు. ఆ ఏడుగురూ పగతీర్చుకునేందుకు కుంభకు డుండే గోవ్రజంలో ఏడు ఆబోతులుగా పుట్టారు. వాళ్ళ ఘోరకృత్యాలు అన్నీ యిన్నీ కావు. మందలలోపడి దొరికిన ఆవు లనూ, ఎద్దులనూ చంపటం, ఎదిరించ వచ్చిన గోపాలకులను పొడిచి కాళ్ళతో మట్టగించటం, గోడలను కొమ్ములతో కుమ్మి పడకొట్టి కొట్టాలలో వున్న పశువులను కూడా హతమార్చటం, వాళ్ల నిత్య కృత్యమైపోయింది.
కుంభకుడు ఆబోతులను పట్టుకొనటానికి ఎన్నో ప్రయత్నాలు చేశాడు. ఎందరెందరో యోధులూ, మల్లులూ వెళ్ళి, వాటిని హత మార్చబోయి తామే హతులయ్యారు. కొన్నాళ్ళకు ఆబోతులు కుంభక విన్నవించుకున్నారు. ప్రజంలో యిక తాము నాశనం చేసేందు కేమీ మిగలక, విదేహరాజ్యంలోని గ్రామాల మీదికి వెళ్ళి పశువులనూ, మనుషులనూ చంపసాగినై. ఈ ఘోరాలు భరించలేక ప్రజలందరూ మిథిలానగరరాజు వద్దకు వెళ్ళి, ఆయనతో, "మహారాజా ! కుంభకుడి గోవులమందలో పుట్టిన ఏడు ఆబోతులు, మా మందులనూ, పచ్చని పైరుపొలాలనూ సర్వనాశనం చేస్తున్నవి. వాటిని చంపి మీరు మమ్మల్ని కాపాడకపోతే, మేమంతా మరో రాజ్యం వలసపోక తప్పదు,” అని విన్నవించుకున్నారు.