7. కాళియమర్దనం | Kaliya Mardana - Kaliya Snake Defeat | Lord Krishna Avatar Story in Telugu

writer
0
కృష్ణుడు కాళియుడి మడుగు లోకి దూకగానే, పాలసముద్రంలో మందరపర్వతం పడినట్టుగా, మడుగు లోని నీరు అల్లకల్లో లమై, దాని అలజడి రసాతలం దాకా దిగింది. కాళియుడికి చాలా కోపం వచ్చింది. వాడు తన ఐదుపడగలూ విప్పి, ఘోరమైన కోరలు కనిపించేలాగా నోళ్ళు పెద్దగా తెరిచి, నోట విషజ్వాలలు కక్కుతూ, మెలికలు తిరిగే తన శరీరాన్ని నది నిండా పరిచి, కృష్ణుణ్ణి అక్కడక్కడా కాట్లు వేసి, అతని శరీర మంతా చుట్టి, నొక్కసాగాడు. కృష్ణుడు మూర్ఛపోయాడు. అది చూసి కాళియుడి చుట్టాలూ, భార్యలూ, పిల్లలూ అయిన మహాసర్పాలన్నీ మూగి, నోళ్ళ మంటలు కక్కుతూ కృష్ణుణ్ణి కరిచారు.

ఇదంతా చూస్తున్న గోపకుమారులు బెదిరిపోయి, దక్షిణంగా కోసెడు దూరంలో ఉన్న వ్రేపల్లెకు పరిగెత్తి, అక్కడి వాళ్ళతో, "నందగోపుడి కొడుకు కృష్ణుడు, ఆడుతూ ఆడుతూ ఉన్న వాడు కాస్తా ఎవరితోనూ చెప్పకుండా, నదిలో పెద్ద పాములుండే మడుగులోకి దూకేశాడు. అన్నిటికన్నా పెద్దపాము పైనుంచి కిందికి కాలూ చెయ్యీ ఆడకుండా అతన్ని చుట్టేసింది. పాము లన్నీ అతన్ని కరిచేస్తున్నాయి, పాపం. వాళ్ళ నాన్న ఎక్క డున్నాడో చెప్పండి. అందరూ వచ్చి కృష్ణుణ్ణి విడిపించే ఉపాయం చూడండి," అన్నారు.

ఈ వార్త విన్నవాళ్ళకు పిడుగు పడ్డట్టయింది. నందుడికి ఆశ్చర్యమూ, దుఃఖమూ ముంచుకొచ్చాయి. " ఎక్కడ ? ఎక్కడ ?" అంటూ ఆయన వార్త చెప్పిన వాళ్ళ వెంబడి బయలుదేరాడు. బలవంతు లైన గోపకు లందరూ చేతుల్లో ఆయుధాలు పట్టుకుని ఆయన కన్న ముందే పరిగెత్తారు. యశోదకు మూర్ఛ వచ్చినంత పని అయింది. ఆమె పెద్దపెట్టున ఏడుస్తూ, విడిపోయిన జుట్టుముడితో, మిగతా గోపస్త్రీలు పట్టు కుని నడిపిస్తూంటే మడుగు దగ్గిరికి బయలుదేరింది.

మొత్తానికి ఊరుకు ఊరంతా కదిలింది. "ఏం ప్రారబ్ధం వచ్చి పడిందర్రా!” అన్నారు కొందరు. " కృష్ణు డెప్పుడూ ఏదో ఒకటి తెచ్చిపెట్టుకుంటాడు. చిన్నవాడు చిన్నవాడి పనులు చెయ్యడు,” అన్నారు మరి కొందరు. " ఇంతకంటే పెద్దగండాలే గడిచాడు. కాళియుడికి మూడిం దనుకో వలిసిందే. కృష్ణుడి కెలాంటి భంగపాటూ రాదు, చూస్తూ ఉండండి," అన్నారు ఇంకా కొందరు.

అందరూ కాళిందీతీరాన నిలిచి కృష్ణుణ్ణి చూసి నీరు కారి పోయారు. అతను పాము చుట్టల్లో చిక్కుకుని చాలా దీనస్థితిలో ఉన్నాడు. ఎవరు గాని చేయగలిగినదేమీ కనిపించలేదు. నందుడూ, యశోదా మూర్ఛ పోయారు. మిగిలినవాళ్ళు వాళ్ళకు రైత్యోప చారాలు చేసి స్పృహ తెప్పించారు.

నందుడు మిగిలిన వాళ్ళతో, "ఏం మహాపాతకం చేసుకున్నానో ఏమో, నా బిడ్డ ఇలా పామువాత పడ్డాడు. నేను మహా పుణ్యాత్ముణ్ణనీ, అందుకే ఇంత అందమూ, బలపరాక్రమాలూ గల కొడుకును కన్నా ననీ అందరూ నన్ను మెచ్చుకుంటే దేవుడి కళ్ళు కుట్టాయి. పూతన మొదలైన వాళ్ళం దరినీ చంపినవాడు ఈ పామువాత పడి ఎలాగైనా బయట పడకపోతాడా అన్న ఆశ కూడా ఒక చెంప పుట్టుతూనే ఉన్నది. మేము ఎలాగైనా ధైర్యం చిక్కబట్టుకోగలం. కాని కొడుకు దుస్థితి చూసి తల్లడిల్లే తల్లి. దుఃఖం ఎలా పోగొట్టేటట్టు ?" అన్నాడు.

అప్పుడు యశోద కృష్ణుడితో, "నాయనా, నువు వెన్న తిన్నందుకు గోపికలు పితూరీ చేస్తే వాళ్ళను సముదాయించటానికి నిన్ను రోటికి కట్టాను. అందుకుగాను ఇవాళ సన్నీ విధంగా బాధిస్తున్నావా? ఎంతో బలం గల వాడివి, నిన్నీ పాము ఏం చెయ్యగలదురా, బాబూ? నేనంటే నీ కష్టం కాదూ? ఒక్క సారి నా కేసి చూసి నవ్వవూ ? కళ్ళు తెరిచి చూడవూ? అడవిలో గోవులు దిక్కులేక ఎలా చెల్లాచెదరయాయో చూడు. వెంటనే వచ్చెయ్యి, నాయనా. విషవృక్షాలు గల అరణ్యాన్ని ధ్వసం చేసిన నీ కీ పాయొక లెక్కా?” అంటూ ఏడ్చింది.

అందరికీ దుఃఖం ముంచుకొచ్చింది. యశోదకు పుత్రనష్టం కలిగినట్టే భావించి తలా ఒక మాటా అన్నారు. కొందరు గోప కులు, " మనమంతా మడుగులోకి దూకి ఆ పాముతో యుద్ధం చేద్దాం. కృష్ణుణ్ణి విడిపిద్దాం.. లేకపోతే ఆ కాళియుడి విషా గ్నిలో చచ్చిపోదాం. కృష్ణుడు లేకుండా వ్రేపల్లె కెలా తిరిగిపోతాం ? " అన్నారు.

బలరాముడు అంతా చూస్తున్నాడు, అందరి మాటలూ వింటున్నాడు. అతను కృష్ణుడితో చివరి కిలా అన్నాడు. "కృష్ణా, మానవస్వభావం చాటు చేసుకుని, లోక హితం మాట మరిచిపోయి, ఈ వెధవ పాముకు చిక్కి, అసహాయుడి వైపోయా వేమిటి? నీ వాళ్ళందరూ ఎంత దైన్యంలో ఉన్నారో గమనించావా? ఆ విషపుపురుగును శిక్షించి అందరినీ సంతోషపెట్టు,” అన్నాడు. 

ఈ మాట వింటూనే స్పృహ తెచ్చుకుని కృష్ణుడు కాళియుడి చుట్టలను ఒక్క తోపు తోసి, గాలిలోకి ఎగిరి బరువుగా పడగల మీదికి దూకాడు. అతను కాళియుడి తోక చేతిలోకి తీసుకుని, వాడి శిరస్సులను కాళ్ళతో మర్దన చేయసాగాడు. యమునలోని అలలు తాళం వేస్తూండగా, తీరాన ఉన్న గోప కుల హర్షధ్వానాలు సంగీతంగా చేసుకుని, కాళియుడి తలలపై కృష్ణుడు చేసే మహా దారుణమైన నాట్యాన్ని ఆకాశం నుంచి దేవతలు చూశారు.

కాళియుడి తలలు చితికాయి. వాడి ముక్కుల రక్తధారలు కారాయి. వాడి కోరలు విరిగి, నోట మంటలతో కూడిన 'విషం వెలువడింది. వాడు వడిలిపోయిన తామరకాడ లాగా అయిపోయి, చచ్చే స్థితికి వచ్చాడు. ఆ స్థితిలో వాడు హీనస్వరంతో, " దేవా, నువు సర్వేశ్వరుడ పని తెలీక, తుచ్ఛమైన కోపంతో, నీ పవిత్రమైన దేహాన్ని ఇలా చేశాను. నా మదానికి తగినట్టు శిక్షించావు. ఇక నన్ను కరుణించి, క్షమించు. నా విష మంతా దిగిపోయింది. బుద్ధి వచ్చింది. నీకు దాసుడుగా ఉండి ఏం చెయ్యమం టే అది చేస్తాను. నీ పాదాలు తాకి నేను పవిత్రుణ్ణి కావటంచేత, నీ ఆగ్రహం నాకు అనుగ్రహమే అయింది,” అన్నాడు వినయంగా.

కృష్ణుడికి కాళియుడి పైన జాలి కలిగి, " ఇక నుంచీ నువు ఈ యమునానదిలో ఉండటానికి వీలులేదు. నీ వారందరినీ వెంటబెట్టుకుని సముద్రంలోకి వెళ్ళిపో. నీ విషంతో పాడైపోయిన నీరంతా పోయి సది ఇక శుద్ధంగా ఉంటుంది, జనానికి ఉప యోగపడుతుంది. నీ తలల మీద నా కాలి గుర్తులు చూసి గరుత్మంతుడు నీ జోలికి రాడు. ఇది నేను నీ కిచ్చే వరం,” అన్నాడు.

కాళియుడు తన పరివారంతో సహా అప్పుడే సముద్రం కేసి ప్రయాణ మయాడు. కృష్ణుడు నదిలో నుంచి ఒడ్డుకు వచ్చాడు. తల్లిదండ్రులు అతన్ని కౌగలించుకుని దీవించారు. అతను వాళ్ళకు నమస్కరిం చాడు. మిగిలిన గోపకులంతా అతని చుట్టూ మూగి, తెగ ప్రశంసించుతూ, అద్భుతాశ్చ ర్యాలు ప్రకటించారు.

గోపకులలో ముఖ్యులైన వారందరికీ కృష్ణు డొక దేవుడు లాగే కనబడ్డాడు. "ఇంత బలమూ, ధైర్యమూ, సాహసమూ ఎక్కడా ఎవరికీ ఉండవు. నీ మహిమ జగత్తంతా కొనియాడ దగినది. మా మంద లకూ, మాకూ నీవే రక్షకుడవు. నీ దయ వల్ల ఇక గోవులు ఎక్కడ బడితే అక్కడ యథేచ్ఛగా సంచరించగలవు. ఈ నదిలో దిగే మునులకు ఎలాటి అపాయమూ ఉండదు. నీ సంగతి అంతకాలమూ మేము గ్రహించలేక పోయాం,” అంటూ వారు అతనికి ప్రదక్షిణ చేశారు.

అతను అందరినీ తగిన విధంగా పరామర్శించి, వారందరితోనూ వ్రేపల్లెకు తిరిగి వచ్చి, ఎప్పటిలాగే సుఖంగా జీవితం గడపసాగాడు.

కొంత కాలం గడిచింది. పశువులకు మేత లేకుండా పోయింది. కృష్ణుడు మిగిలిన గోపకులతో కర్తవ్యం ఆలోచించాడు. అప్పుడు వారిలో పెద్దవాళ్ళు ఒక విషయం కృష్ణుడికి చెప్పారు.

గోవర్ధన పర్వతానికి ఉత్తరంగా, కాళిందీ నదికి దగ్గరలోనే అతి విశామైన తాటితోపు ఉన్నది. అందులో పచ్చిగడ్డి పుష్కలంగా ఉన్నది. అయితే అందులో ధేనుకుడనే రాక్షసుడు గాడిద రూపంలో ఉండటం చేత అందులోకి ఏ ప్రాణి ప్రవేశించదు.

ఈ విషయం చెవుల పడేసరికి బలరామ కృష్ణులకు ఉత్సాహం పుట్టుకొచ్చింది. వాళ్ళు ధైర్యం గల గోపకులతో, "పశువు లకు మేత వుండాలి గాని, రాక్షసులకు భయపడతామా? పదండి! " అన్నారు. వాళ్ళంతా గోవులను తోలుకుని తాటితోపుకు బయలుదేరి వెళ్ళారు. అందులో ఎటు చూసినా నవనవలాడుతూ బోలెడంత పచ్చిక. పశువులు ఆత్రంగా ధాన్ని మేయ నారంభిం చాయి. కృష్ణుడు మొదలైన గోపకులు పరమానందంతో ఆ గడ్డిలో విహరించారు.

కృష్ణుడా తోపు అందం చూసి ఆనందిం చాడు. తాటిచెట్లు పాతాళంలో నుంచి పైకి వచ్చి, నల్లటి శరీరాలతోనూ, పడగల లాటి తలలతోనూ ఆడుతున్న పాముల్లాగా ఉన్నాయి. వాటి మీద ఉన్న తాటిపళ్ళు ఎరుపూ, నలుపూ కలిసిన రంగు కలిగి పుండి, మంచి వాసన కొడుతున్నాయి. కృష్ణుడు బలరాముడితో, "అన్నా, నువు చెట్లెక్కి పళ్ళు పడెయ్యి, నా కా పళ్ళు తినాలని ఉన్నది. ఆవులకు కూడా పెడదాం,” అన్నాడు.

"ఎక్కటం చాలా ఆలస్య మవుతుందిలే. నేను చెట్ల మొదళ్ళు పట్టుకుని ఊపుతాను, రాలిన పళ్ళను అందరూ ఏరుకోండి,” అని బలరాముడు గోపకు లందరితోనూ చెప్పి, ఒక్కొక్క చెట్టునే మొదలు పట్టుకుని అవ లీలగా ఊపసాగాడు. తపతపా మోత చేస్తూ తాటిపళ్ళు రాల నారంభించాయి.

ఈ ధ్వని ధేనుకాసురుడి చెవిని పడింది. గాడిద ఆకారంలో ఉండే ఆ భయంకర రాక్షసుడు, తన లాటి ఆకారాలలోనే ఉన్న వెయ్యిమంది అనుచరులు వెంట రాగా బలరామకృష్ణు లున్న చోటికి వచ్చాడు. వాణ్ణి చూసి గోపకు లంతా హడలిపోయారు. 

ఇలా గాడిద లన్నీ వస్తుంటే దుమ్ము ఆకాశంలోకి లేచి మబ్బు లాగా అయింది. అవి ఓండ్ర పెడుతుంటే దిక్కులు పిక్క టిల్లాయి." అలా వచ్చే గాడిదలమందకు ముందు నడిచే ధేనుకాసురుడికి ఎదురుగా, ఉత్తచేతులతో బలరాముడు నిలబడ్డాడు. ధేనుకుడు బలరాముడికి దగ్గరగా వస్తూనే, వెనక్కు తిరిగి, వెనకకాళ్ళు రెండూ ఎత్తి, బలంగా బలరాముడి గుండెల మీద తన్నాడు. బలరాముడు ఒడుపుగా ఆ కాళ్ళు రెండూ పట్టుకుని ధేనుకుణ్ణి విసిరి పైకి ఎగర వేశాడు. ధేనుకుడి శరీరం తాటిచెట్లకు తగిలి నుగ్గు నుగ్గయింది. ఆ శరీరంతో బాటు తాటి పళ్ళు కూడా చాలా రాలాయి.

బలరాముడు అంతటితో పోనీక మిగిలిన రాకాసిగాడిదలను కూడా వెనకకాళ్ళు పట్టుకుని, తాటిచెట్ల కేసి కొట్టి చంపాడు. అతనితోబాటు కృష్ణుడు కూడా ఆ రాక్షసు లను చంపాడు. మొత్తం తాటితోపంతా తాటి పళ్ళతోనూ, రాక్షసుల కళేబరాలతోనూ నిండిపోయింది. గోపకులు ఆ ఇద్దరి పౌరు షాన్నీ మెచ్చుకున్నారు. రాక్షసులు చావ టంతో ఆ తాటితోపు, నిరపాయ మయింది.

మరొకసారి గోపకులు భాండీరవట ప్రాంతంలో ఆవులను మేపుతూ ఆటలలో ముణిగి ఉండగా, ప్రలంబు డనే రాక్షసుడు ఒక గోపకుడి రూపంలో వారితో చేరాడు. గోపబాలకు లందరూ హరిణక్రీడన మనే ఆట ఆడదలచి జంటలు జంటలుగా చీలారు. కృష్ణుడూ, అతని బావమరిది శ్రీధాముడూ ఒక జంటగా అయారు. ప్రలంబుడు బల రాముడికి జంట అయాడు. ఆ విధంగా సగంమంది కృష్ణుడి పక్షమూ, సగంమంది శ్రీధాముడి పక్షమూ అయారు. ఆట ఏమి టంటే భాండీరవటవృక్షం హద్దుగా పెట్టు కుని జింక లాగా దూకుతూ పరిగెత్తాలి. ఈ ఆటలో కృష్ణుడి పక్షంవాళ్ళు గెలిచారు. శ్రీధాముడి పక్షంవాళ్ళు ఓడారు. ఓడిన వాళ్ళు గెలిచినవాళ్ళను మూపు మీద ఎక్కించుకుని హద్దు దాకా మోసుకుపోవాలి.

అందుచేత ప్రలంబుడు బలరాముణ్ణి మూపు మీద ఎక్కించుకుని, ఎటో తీసుకు పోయి, అకస్మాత్తుగా తన రాక్షసాకారం ధరించి, ఆకాశంలోకి లేచాడు. బలరాముడు ఆశ్చర్యపడి, ఏం చెయ్యాలో తోచక, కృష్ణుణ్ణి కేక పెట్టి తన స్థితి చెప్పాడు. "వాడి అంతు తేల్చక చూస్తావేం?" అని కృష్ణుడు హెచ్చ. రించాడు. వెంటనే బలరాముడు పిడికిలి బిగించి, రాక్షసుడి నెత్తిన ఒక్కటి పెట్టాడు. వెంటనే రాక్షసుడు, తల పగిలి, నేలకూలి చచ్చాడు. ప్రలంబుణ్ణి చంపాక బల రాముడికి బలదేవు డనే పేరు వచ్చింది.

కామెంట్‌ను పోస్ట్ చేయండి

0కామెంట్‌లు

కామెంట్‌ను పోస్ట్ చేయండి (0)